ఇదినామాట‌.. మాటే శాస‌నం

0
238

2019 ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యం అనంత‌రం శ‌నివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పార్టీ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేలు జ‌గ‌న్ ను పార్టీ ఎల్పీ నేత‌గా ఏక‌వాక్య తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చెప్పిన మాట‌లు, ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

> 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను గెలవడం ఒక రికార్డు.

> 50 శాతం ఓట్లు ఒక పార్టీకి రావడం చరిత్ర.

> అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనం.

> చరిత్రలో సువర్ణాక్షరాలతో మన విజయం లిఖించబడుతుంది.

> మన పార్టీ నుంచి అన్యాయంగా చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23, ఎంపీలు ముగ్గురు,ఇప్పుడు టీడీపీకి మిగిలింది…చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23.

> ఇప్పుడు మన టార్గెట్ 2024. వచ్చే ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవాలి.

> ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.

> వచ్చే ఎన్నికల్లో మన పాలన చూసి ప్రజలు ఓటెయ్యాలి.

> రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తా.

> దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేవిధంగా ప్రక్షాళన చేస్తా.

> నాకు మీ అందరి సహాయసహకారాలు కావాలి.

> మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా.

> త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయి..వాటిని కూడా క్లీన్‌స్వీప్ చేయాలి.

> ఈ విజయానికి మీ అందరూ కారణం.

> ఐదేళ్లుగా ప్ర‌జ‌ల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడాం.