గవర్నర్ ని కలిసిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన : జగన్

0
226
గవర్నర్ ని కలిసిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన : జగన్
గవర్నర్ ని కలిసిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన : జగన్

మాజీ మంత్రి, తన చిన్నాన్న “వివేకానంద రెడ్డి” హత్య ఘటనపై CBI విచారణ జరిపించాలని YCP అధినేత జగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను “రాజ్ భవన్” కలిసిన AP నెలకొన్న పరిస్థితులను వివరించాడు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… “ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీసులు చంద్రబాబుకు “వాచ్ మెన్”ల వ్యవహరిస్తున్నారు.. వారి దర్యాప్తు తీరు చూస్తుంటేనే వాళ్ళ వల్ల మాకు న్యాయం జరగదు అని స్పష్టంగా అర్దం అవుతుంది. అందుకె మా చిన్నాన్నా వివేకానందరెడ్డి హత్య కేసును CBI కి అప్పగించాలి” అంటూ గవర్నర్ ని కోరమని జగన్ మీడియాకు వివరించాడు.

రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా ?.. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిని ఢీకొట్టేందుకు తాము జమ్మలమడుగులో కొత్త అభ్యర్థికి టికెట్ ఇచ్చాం.. ఆ సమయంలో నియోజకవర్గంలో అత్యధికంగా తిరుగుతున్న తన చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు జగన్. ఈ హత్యలో TDP హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని మరోసారి ప్రశ్నించారు.

హత్యకు గురైంది సామాన్యమైన వ్యక్తి కాదు, 4 సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి హత్యకు గురైతే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి ఇంట్లో ఒక్కడే ఉన్నాడని తెలుసుకొని.. పక్కా వ్యూహంతో కిరాతకంగా హత్య చేయడం దారుణం.. అలాంటి వ్యక్తులను కాపాడే పనిలో ఉన్న ఏపీ డీజీపీ, అదనపు డీజీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తుల్ని ఎన్నికల బాధ్యతలనుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు జగన్ మీడియా సమావేశంలో వివరించాడు.