క‌న్నీళ్లు ఆగ‌వు : సీఎం జ‌గ‌న్ గురించి మైనార్టీ మ‌హిళ ఏం చెప్పిందంటే..?

0
540

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన రాజ‌న్న బ‌డిబాట కార్య‌క్రమాన్ని సీఎం జ‌గ‌న్ ఈ రోజు ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌ల ప‌రిధిలోగ‌ల పెనుమాక జ‌డ్పీ పాఠ‌శాల‌లో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. సీఎం జ‌గన్‌తోపాటు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విద్యార్థుల‌తో వారి వారి త‌ల్లిదండ్రులు అక్ష‌రాభ్యాసం చేయించారు. ఇదే సంద‌ర్భంలో సీఎం జ‌గ‌న్ పక్క‌నే కూర్చున్న ఓ విద్యార్థిని జ‌గ‌న్ పిలిచి మ‌రీ త‌న ఒడిలో కూర్చూబెట్టుకున్నారు. ఇంత‌లో త‌న అమ్మ ఆమెనంటూ ఆ విద్యార్థి ఓ మైనార్టీ మ‌హిళ‌వైపు చూపించాడు ఆ విద్యార్థి. జ‌గ‌న్ ఆమెను ఆప్యాయ‌త‌తో ప‌ల‌క‌రించారు.

ఇదే విష‌య‌మై ఆ మైనార్టీ మ‌హిళ మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చింది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న బిడ్డ‌ను మేన మామ మాదిరి ఎంతో ఆప్యాయ‌త‌తో ద‌గ్గ‌ర‌కు తీసుకుని అక్ష‌రాభ్యాసం చేయించాడ‌ని, ఆ సంద‌ర్భం తాను జీవితంలో మ‌రిచిపోలేన‌ని చెప్పింది. ఆ ఒక్క విష‌యంతో జ‌గ‌న్ త‌న సొంత అన్న‌కంటే ఎక్కువ‌గా క‌నిపించాడ‌ని ఆనంద‌బాష్పాలు కార్చింది. అటువంటి వ్య‌క్తి సీఎంగా ఉండ‌టం మ‌నంద‌రి అదృష్ట‌మంటూ ఆ మ‌హిళ చెప్పుకురావ‌డం గ‌మ‌నార్హం.