మాజీ రాష్ట్ర‌ప‌తితో వైఎస్ జ‌గ‌న్ సంప్ర‌దింపులు నిజ‌మేనా..?

0
74

ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చిన పార్టీకే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ మ‌రోసారి స్పష్టం చేసింది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌తో వైసీపీ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల్లో ఎటువంటి నిజం లేద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేంత వ‌ర‌కు వైసీపీ ఎటువంటి నిర్ణ‌యం తీసుకోబోద‌ని, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీతో వైఎస్ జ‌గ‌న్ ఎటువంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌లేద‌ని ఆయ‌న తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చే పార్టీకి ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉంటే, ప్ర‌త్యేక హోదా ఇచ్చే వారికే తాము మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చెప్పారు.