శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఈజ్ ఏ గుడ్ బాయ్ : వైఎస్ జ‌గ‌న్‌

0
211

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిపై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో అధికార‌, ప్రతిప‌క్ష పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో మాట‌ల తూటాలు పేలుతున్న సంగ‌తి తెలిసిందే. స‌భ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి స్పీక‌ర్ తీసుకున్న స‌భ్యులకు కుర్చీల కేటాయింపు నిర్ణ‌యం మ‌రింత దుమారం రేపింది. ఆ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ ప్ర‌తిప‌క్షం వారి వాయిస్‌ను వినిపించారు.

అదే సంద‌ర్భంలో మైక్ అందుకున్న సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ ప్రతిపక్ష స‌భ్యులు అడిగిన ప్రశ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు. ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఈ అసెంబ్లీ స‌మావేశాల్లోనే కాకుండా, వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ అదే సీటులో కూర్చునేవాడు. అధికార‌ప‌క్షానికి కేటాయించిన కుర్చీల‌లో కూర్చుంటే మీకు (స్పీక‌ర్‌) క‌నిపించ‌నేమో అని ఆలోచించిన శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నాడు కూర్చున్న కుర్చీలోనే కూర్చొండి ఉండొచ్చు. అందులో శ్రీ‌ధ‌ర్‌రెడ్డిన త‌ప్పుబ‌ట్టాల్సిన ప‌నిలేదు. కానీ మీరు (స్పీక‌ర్‌) అక్క‌డి నుంచి లేచి నీకు కేటాయించిన సీటులో కూర్చోవాల‌ని చెప్ప‌గానే.. శ్రీ‌ధ‌ర్ రెడ్డి గుడ్‌బాయ్‌లా అక్క‌డ్నుంచి లేచి త‌న సీటులోకి వెళ్లి కూర్చున్నాడంటూ జ‌గ‌న్ అన్నారు. ఇలా సీట్ల ర‌గ‌డ విష‌యంలో శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని ఉద్దేశిస్తూ జ‌గ‌న్ మాట్లాడిన మాట‌లు స‌భ‌ను న‌వ్వుల్లో తేల్చాయి.