న‌టుడు అలీకి జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి..!

0
206

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడిగా వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతున్న అలీ ఇటీవ‌ల రాజ‌కీయాల‌పై పూర్తిస్థాయి దృష్టిని కేంద్రీక‌రించారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న్ను కొన్ని వివాదాలు సైతం చుట్టుముట్టాయి. రాజ‌కీయ ఆరంగేట్రంలో టీడీపీతో త‌త్సంబంధాలు న‌డిపిన అలీ ఆ త‌రువాత వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

ఇదిలా ఉండ‌గా, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌విని క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల తాజా స‌మాచారం మేర‌కు అలీని ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి శాస‌న మండ‌లికి పంపేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ట‌. ఎమ్మెల్సీగా ఎన్నుకోవ‌డంతోపాటు మంత్రి ప‌ద‌వితో త‌న కేబినేట్‌లో చోటు క‌ల్పించాల‌న్న‌ది జ‌గ‌న్ నిర్ణ‌యంగా తెలుస్తుందని రాజ‌కీయ‌వ‌ర్గాల స‌మాచారం.