ఒకే వేదిక‌పై ‘జ‌గ‌న్ – చంద్ర‌బాబు’..!

0
127

అవును, ఏపీ సీఎం జ‌గ‌న్‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ఇద్ద‌రూ ఒకే వేదికపై ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ ఆస‌క్తిక‌ర ఘ‌ట్టం అసెంబ్లీ స్పీక‌ర్‌చైర్ వ‌ద్ద చోటు చేసుకుంది. కాగా, ఈ రోజు శాస‌న స‌భ్యులు ఉప స‌భాప‌తిగా బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తిని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇదిలా ఉండ‌గా, స్పీక‌ర్ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ మేర‌కు డిప్యూటీ స్పీక‌ర్‌గా కోన ర‌ఘుప‌తి నామినేష‌న్ వేశారు. ఆయన్ను బ‌ల‌ప‌రుస్తూ ప‌ది మంది వైసీపీ ఎమ్మెల్యేలు సంత‌కాలు చేశారు. మ‌రో నామినేష‌న్ దాఖ‌లు కాక‌పోవ‌డంతో కోణ రఘుప‌తిని డిప్యూటీ స్పీక‌ర్‌గా ఎన్నిక చేశారు.

అయితే, ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఎన్నిక రోజున కుర్చీలో కూర్చోబెట్టేందుకు రాని మాజీ సీఎం చంద్ర‌బాబు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోన ర‌ఘుప‌తికి ఆహ్వానం ప‌లింకేందుకు వ‌చ్చారు. త‌న‌కు ఆ రోజున ఆహ్వానం లేద‌ని, ఆ కార‌ణంగానే తాను రాలేదంటూ చంద్రబాబు క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇలా డిప్యూటీ స్పీక‌ర్‌ కోన ర‌ఘుప‌తిని చైర్‌లో కూర్చోబెట్టేందుకు సీఎం జ‌గ‌న్‌తో స‌హా, చంద్ర‌బాబు రావ‌డంతో అసెంబ్లీ హాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ కొన‌సాగింది