జ‌గ‌న్ – కేసీఆర్ భేటీలో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించేనా..?

0
168

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాసేప‌టి క్రితం భేటీ అయ్యారు. ఈ రోజు ఉద‌యం విజ‌య‌వాడ‌కు చేరుకున్న కేసీఆర్ ముందుగా విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. త‌మ ప్రభుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వ ఆహ్వాన ప‌త్రిక‌ను అమ్మ‌వారి ముందు ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

పూజ‌ల అనంత‌రం త‌న కాన్వాయ్‌తో ఏపీ సీఎం జ‌గ‌న్ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయ‌న‌తో క‌లిసి లంచ్ చేశారు. ఆ త‌రువాత ప్ర‌త్యేక స‌మావేశ‌మైన వీరిద్ద‌రి మ‌ధ్య రాష్ట్ర విభ‌జ‌న వివాదాల ప‌రిష్కార దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌ధానంగా రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం 9, 10లోని ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల విభ‌జ‌న‌, విద్యుత్ ఉద్యోగుల పంప‌కాలు, బ‌కాయిలు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను రెండు రాష్ట్రాలు ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఇరువురి భేటీలో పైన‌పేర్కొన్న ప‌లు అంశాల‌కు ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయి.