క‌డ‌ప‌లో వైఎస్ జ‌గ‌న్ ఎంట్రీ మామూలుగా లేదుగా..!

0
184

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి క‌డ‌ప జిల్లాలో మునుపెన్న‌డూ లేని విధంగా ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. కాగా, జ‌గ‌న్ ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 14 నెల‌ల‌పాటు కొన‌సాగి బుధ‌వారం నాటికి ఇచ్చాపురంలో విజ‌య‌వంతంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతం సంద‌ర్భంగా జ‌గ‌న్ తిరుమ‌లలో వెల‌సిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ఇవాళ ఉద‌యం 8:30 గంట‌ల‌కు ద‌ర్శించుకున్నారు. అన‌త‌రం తిరుమ‌ల నుంచి క‌డ‌ప ద‌ర్గాను ద‌ర్శించుకునేందుకు బ‌య‌ల్దేరారు. ఈ క్ర‌మంలోనే క‌డ‌ప‌లోని రైల్వే కోడూరుకు చేరుకున్న వైఎస్ జ‌గ‌న్‌కు జిల్లా ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జ‌గ‌న్‌కు హార‌తులు ప‌ట్టేందుకు జిల్లాలోని ప్ర‌తి గ్రామం నుంచి మ‌హిళ‌లు త‌ర‌లి వ‌చ్చారు.

అలాగే, వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, నేత‌లు సైతం గ్రామాల నుంచి బైక్ ర్యాలీగా బ‌య‌ల్దేరి జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు రైల్వే కోడూరుకు చేరుకున్నారు. 14 ఏళ్ల‌పాటు నిర్విరామంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిర్వ‌హించిన మా నేత‌కు ఘ‌న స్వాగ‌తం అంటూ జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే వైఎస్ జ‌గ‌న్ మ‌రికొద్ది సేప‌ట్లో క‌డ‌పలో ప్ర‌సిద్ధిపొందిన ద‌ర్గాలో ప్రార్ధ‌న‌లు నిర్వ‌హించ‌నున్నారు.