వైఎస్ జ‌గ‌న్ చేయాల్సిన కుట్ర‌ల‌న్నీ చేశాడు : చంద్ర‌బాబు

0
167

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను అడ్డుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేయాల్సిన కుట్ర‌ల‌న్నీ చేశాడ‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కాగా, ఈ రోజు సీఎంఓ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడారు. రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మోడీ, కేసీఆర్, జ‌గ‌న్‌ల‌తో పోరాడాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌న్నారు.

తెలుగుదేశం నాయ‌కుల ఇళ్ల‌పైకి ఇన్‌క‌హ ట్యాక్స్‌, ఈడీ, సీబీఐ, తెలంగాణ పోలీసులు ఇలా అంద‌ర్నీ ప్ర‌యోగించారన్నారు. నా జ‌న్మ‌భూమిని కాపాడుకోవాల‌నే త‌ప‌న‌తోనే ప్ర‌జ‌లంత ఏక‌మై పోలింగ్ స‌జావుగా జ‌రిగేలా చూశార‌న్నారు. ఏపీని జ‌గ‌న్ నుంచి కాపాడేందుకు దూర ప్రాంతాల నుంచి వ‌చ్చి జ‌నం ఓట్లు వేశార‌ని చంద్ర‌బాబు అన్నారు.