‘హిప్పీ’ ఎవతివే ఎవతివే లిరికల్ వీడియో సాంగ్..!

0
303
hippi lyrical song

వి క్రియేషన్స్ ఏషియన్ సినిమాస్ పతాకం మీద టీఎన్ సంతోష్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా ‘హిప్పీ’. ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైమెంట్ గా సాగే చిత్రంలో ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో క్రేజ్ కొట్టేసిన కార్తికేయ హీరోగా నటిస్తున్నాడు. కార్తికేయకు జోడిగా దిగాంగన నటిస్తుంది. ఒక ప్రధానమైన పాత్రలో జేడీ చక్రవర్తి చేస్తున్నారు. లవ్, యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ లాంటి మసాలాలను మేళవించిన ట్రైలర్ విడుదల చేయడంతో యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు.

“ఎవతివే… ఎవతివే.. యెదను పట్టి వదలవే. ఎవతివే.. ఎవతివే.. కళ్లలోంచి కదలవే.. ” అంటూ కొనసాగే పాటను అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని, నివాస్ కె. ప్రసన్న సంగీతాన్ని అందించగా కార్తీక్ ఆలపించిన పాట యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీకి కలైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అతి త్వరలోనే తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు.