వైఎస్ వివేకానంద‌రెడ్డి జీవితంలోని ముఖ్య ఘ‌ట్టాలు ఇవే..!

0
311

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చిన్నాన్న, వైఎస్ఆర్ సోద‌రుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి క‌న్నుమూశారు. పులివెందుల‌లోని ఆయ‌న నివాసంలో ఈ రోజు తెల్ల‌వారు జామున ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు భార్య సౌభాగ్య‌, కుమార్తె ఉన్నారు. వివేకానంద‌రెడ్డి వ‌య‌స్సు 68 ఏళ్లు.

1989 – 1994లో రెండు ప‌ర్యాయాలు పులివెందుల శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వివేకానంద‌రెడ్డి ఆ త‌రువాత 1999, 2004 ఎన్నిక‌ల్లో క‌డ‌ప లోక్‌స‌భ స్థానం నుంచి రెండు ప‌ర్యాయాలు ఘ‌న విజ‌యం సాధించారు. కిర‌ణ్ కుమార్‌రెడ్డి ప్ర‌భుత్వంలో వివేకానంద‌రెడ్డి వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు. అంతేకాక 2009 సెప్టెంబ‌ర్‌లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మండలి స‌భ్యుడిగా కూడా ఆయ‌న ప‌నిచేశారు.

ముక్కుసూటిగా మాట్లాడే వివేకానంద‌రెడ్డి సౌమ్యుడిగా పేరుపొందారు. త‌న‌కు స‌హాయం చేయ‌మ‌ని అడిగిన వారి కోసం ఎంత వ‌ర‌కైనా వెళ్లేవారు. అంతేకాక‌, రాజ‌కీయాల్లో వైఎస్ఆర్‌కు కుడిభుజంగా వ్య‌వ‌హ‌రిస్తూ అజాత‌శ‌త్రువుగా పేరు సంపాదించారు. గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా వివేకానంద‌రెడ్డి ప‌నిచేశారు. 1950 ఆగ‌స్టు 8న పులివెందుల‌లో జన్మించిన వైఎస్ వివేకానంద‌రెడ్డి తిరుప‌తిలోని ఎస్వీ అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ చ‌దివారు. ఎంతో సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం యావ‌త్ ఏపీని విషాదంలో నింపింది.