విశాఖ‌లో గెలుపు వైసీపీ అభ్య‌ర్ధిదే..!

0
340

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు మరోసారి సీఎం చంద్ర‌బాబుపై ధ్వ‌జ‌మెత్తారు. విశాఖ లోక్‌స‌భ స్థానంలో వైసీపీ అభ్య‌ర్ధి స‌త్య‌నారాయ‌ణ ఘ‌న విజ‌యం సాదించ‌బోతున్నారంటూ జోస్యం చెప్పారు. స‌త్య‌నారాయ‌ణ ఓట‌మికి టీడీపీ అధినాయ‌క‌త్వం ఎన్నో కుట్ర‌ల‌కు పాల్ప‌డింద‌ని, అయినా ఫ‌లితం లేక‌పోయింద‌ని ఆయ‌న ఎద్దేవ చేశారు.

విశాఖ లోక్‌స‌భ స్థానానికి బాల‌కృష్ణ చిన్న అల్లుడు శ్రీ భ‌ర‌త్‌కు టికెట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి పార్టీ కేడ‌ర్ మాత్రం జ‌న‌సేన అభ్య‌ర్ధి ల‌క్ష్మీ నారాయ‌ణకు ప్ర‌చారం చేయాలంటూ ఆదేశించార‌ని చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. ల‌క్ష్మీ నారాయ‌ణ ఎన్నిక‌ల ఖ‌ర్చంతా శ్రీ‌భ‌ర‌త్‌తోనే పెట్టించార‌ని, అయినా వాళ్ల ఆట‌లు సాగ‌లేద‌ని విజ‌యసాయిరెడ్డి ట్వీట్ చేశారు.