రాళ్ల‌తో, క‌ర్ర‌ల‌తో వైసీపీ – టీడీపీ శ్రేణుల దాడులు..!

0
88
Have shocks started for YCP? : Gunta Murali into TDP
Have shocks started for YCP? : Gunta Murali into TDP

పోలింగ్ ముగిసి 15 రోజులు దాటినా కూడా ప‌ల్లెల్లో ఆ వేడి ఇంకా త‌గ్గ‌డం లేదు. చిన్న చిన్న కార‌ణాల‌ను పెద్ద‌విగాచేసి ఇరువ‌ర్గాలు దాడుల‌కు దిగుతున్నాయి. తాజాగా, క‌ర్నూలు జిల్లాలో టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఎమ్మిగ‌నూరు మండ‌లం మాచుమాన్‌దొడి గ్రామంలో టీడీపీ – వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్లు, క‌ర్ర‌ల‌తో ఒక‌రిపై మ‌రొక‌రు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరువ‌ర్గాల‌కు చెందిన 12 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఐదుగురి త‌ల‌ల‌కు బ‌ల‌మైన గాయాలు అయ్యాయి. వెంటే గాయ‌ప‌డ్డ వారిని మెరుగైన చికిత్స నిమిత్తం క‌ర్నూలు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మాచ్‌మాన్‌దొడ్డి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన బోయ శ్రీ‌రామ్ రోడ్డుపై ఎద్దుల బండిని ఆపాడు. అయితే, ట్రాక్ట‌ర్ వెళ్లేందుకు ఎద్దుల బండి అడ్డంగా ఉంద‌ని, దాన్ని తొల‌గించాల‌ని టీడీపీకి చెందిన డీల‌ర్ శ్రీ‌ను కోరాడు. ట్రాక్ట‌ర్ వెళ్లేందుకు స్థ‌లం ఉంద‌ని, త‌న ఇంటి ముందు ఎడ్ల బండిని నిలిపానంటూ ఎడ్ల‌బండిని తొల‌గించేందుకు స‌సేమిరా అన్నాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆ త‌రువాత ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి.