నన్ను ఐరన్ లెగ్ అనినవారికి నా విజయమే సమాధానం..!

0
257
roja selvamani face book

వైసీపీ నేత, లేడీ ఫైర్ బ్రాండ్ రోజా చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందింది. ఈ పరంగా రోజా స్పందిస్తూ…. ఒకప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అంటూ విమర్శలు గుప్పించిన వారికి నా విజయమే సమాధానామంటూ తెలిపింది. ఈ ఎన్నికల ఫలితాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి రాష్ట్ర మహిళలు సరైన విధంగా బుద్ధి చెప్పారంటూ రోజా చెప్పింది.  రోజా మరోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా పాదాభివందనాలు అంటూ రోజా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. జగనన్నను ముఖ్యమంత్రి ఆశీర్వదించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికి నా ధన్యవాదాలు అంటూ తెలియ చేసింది.

మరోసారి ఎమ్యెల్యేగా నాకు గెలుపును అందించిన నగరి నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా నా పాదాభివందనలు.శ్రీ వైఎస్ జగన్ అన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించినా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు.

Posted by Roja Selvamani on Thursday, May 23, 2019