పరారీలో మెరుగైన సమాజ ఉద్యమకారుడు.. టీవీ9 మాజీ సి‌ఈ‌ఓ రవిప్రకాశ్ మీద రెచ్చిపోతున్న విజయ సాయి రెడ్డి

0
141

టీవీ9 మాజీ సి‌ఈ‌ఓ రవిప్రకాశ్ మీద వైయెస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎం‌పి విజయ సాయి రెడ్డి మరో సారి రెచ్చిపోయారు. తన ట్విటర్ అకౌంట్ లో..  మెరుగైన సమాజ ఉద్యమకారుడు పరారీలో వున్నాడంటూ సెటైర్లు వేశారు. అమరావతి వెళ్తే 23 తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్నాటక మీదుగా ముంబాయి చేరినట్టు సమాచారం అంటూ పరోక్షంగా చంద్రబాబు పైనా సెటైర్లు వేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టి‌డి‌పి సర్కారు గల్లంతవుతుందంటూ సందట్లో సడేమియాలా ఆసాంగతినీ ఎత్తుకున్నారు విజయ సాయి రెడ్డి.

కొన్ని రోజులుగా రవి ప్రకాష్ ను టార్గెట్ చేస్తున్న విజయ సాయి..  రవి ప్రకాష్ మీదున్న తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని బయట పెట్టేసుకుంటున్నారు.. ఏకబిగిన విమర్శలు, సెటైర్లు కురిపిస్తున్నారు.. విజయ సాయి రెడ్డి వీరావేశం ఏంటో.. అసలాయన ఏమంటున్నారో అతని మాటల్లోనే..