ఇది రోజా సర్వే

0
255

ఏపీ ఎన్నికల్లో తమ పార్టీ 126 నుంచి 130 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్ జగన్ సీఎం కాబోతున్నారని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కాదు ప్రజల నాడి చూసి ఈ విషయం చెబుతున్నానని ఆమె అన్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాల కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. ప్రజలు కోరుకున్న విధంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆమె అన్నారు. అలాగే, 22 నుంచి 23 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలవబోతోందని రోజా జోస్యం చెప్పారు.