ఓట‌మి భ‌యంతోనే.. చంద్ర‌బాబు విన్యాసాలు : శ్రీ‌కాంత్‌రెడ్డి

0
155

ముఖ్య‌మంత్రి వంటి బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న సీఎం చంద్ర‌బాబు చేయ‌కూడ‌న‌టువంటి ప‌నులు, చ‌ట్ట విరుద్ద‌మైన ప‌నుల‌ను చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత శ్రీ‌కాంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. కాగా, శ్రీ‌కాంత్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఏపీ టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింద‌ని, అందులో ఒక గ్రూపు చంద్ర‌బాబుకు స్వ‌స్తి ప‌లికేందుకు బై బై బాబు అన్న నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. దీంతో ఖంగుతిన్న చంద్ర‌బాబు వారిని బుజ్జ‌గించేందుకు ర‌క ర‌కాల విన్యాసాలు చేస్తున్న‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు. ఎంతో ప్ర‌జాస్వామ్య‌బద్దంగా జ‌రిగే ఓటింగ్‌పై ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న చంద్ర‌బాబుకు న‌మ్మ‌కం లేక‌పోవ‌డం విడ్డూర‌ని శ్రీ‌కాంత్ రెడ్డి అన్నారు. ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబు ర‌కర‌కాల విన్యాసాలు చేస్తున్నార‌న్నారు.