ప్ర‌త్యేక హోదాపై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

0
214

ఏపీకి ప్ర‌త్యేక హోదాపై సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన జ‌గ‌న్ ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఏపీకి ప్యాకేజీ వ‌ద్దు.. హోదా కావాల‌ని తీర్మానం చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో 59 శాతం జ‌నాభాను, అప్పుల‌ను వార‌స‌త్వంగా పొందామ‌ని, అదే స‌మ‌యంలో ఏపీకి మౌలిక వ‌స‌తులు అతి త‌క్కువ‌గా వ‌చ్చాయ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. రాష్ట్ర విభ‌జ‌న‌వ‌ల్ల ఆదాయాన్ని, ఉద్యోగాల‌ను ఇచ్చే హైద‌రాబాద్ లేకుండా పోయింద‌ని, అన్ని విధాల ఏపీకి జ‌రిగిన అన్యాయాల‌ను ఒక్క ప్ర‌త్యేక హోదాతోనే పూడ్చ‌గ‌ల‌మ‌న్నారు.

ప్ర‌త్యేక హోదా ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి క‌నుక, ఐదు కోట్ల మంది త‌రుపున త‌మ ప్ర‌భుత్వం అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ప్లానింగ్ క‌మిష‌న్‌తో మాట్లాడ‌క‌పోవ‌డంవ‌ల్లే హోదా రాలేద‌ని, త‌క్కువ ఆదాయం ఉన్న రాష్ట్రం క‌నుక న్యాయం చేయాలంటూ తీర్మానంలో పేర్కొన్నారు.