ఇక అమ‌రావ‌తిలోనే వైసీపీ హెడ్ ఆఫీస్..!

0
191

ఈ నెల 23న వెలువ‌డ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాను వ్య‌క్తం చేస్తుంది. వైసీపీ విజ‌యం త‌ధ్యం అన్న న‌మ్మ‌కంతోనే ఆ పార్టీకి సంబంధించిన నేత‌లు కానీ, కార్య‌క‌లాపాలు కానీ ఉండ‌వ‌ల్లి నుంచి న‌డిపించాల‌ని ముఖ్య నేత‌లు నిర్ణ‌యించారు.

ఇదే విష‌య‌మై వైసీపీ సీనియ‌ర్ నేత రామ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నిక‌ల త‌రువాత సీఎంగా బాధ్య‌తలు చేప‌ట్టిన చంద్ర‌బాబు త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై లేనిపోని అవాకులు, చ‌వాకులు పేల్చార‌ని, జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే రాజ‌ధానిగా అమ‌రావ‌తిని మారుస్తారంటూ దుష్ప్ర‌చారం చేశారని, వారి ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతూ జ‌గ‌న్ ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవ‌డంతోపాటు, పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని కూడా అక్క‌డే ఏర్పాటు చేశార‌న్నారు.

విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ నెల 16న ఎన్నిక‌ల కౌంటింగ్‌కు సంబంధించిన స‌మావేశం విజ‌య‌సాయిరెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నుంద‌ని రామ్‌కుమార్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డ‌క‌పోయినా, ఏపీలో అధికారంలోకి వ‌చ్చేది వైసీపీనేన‌ని ప్ర‌జ‌లు కూడా ఫిక్స్ అయిపోయార‌ని ఆయ‌న అన్నారు.