బిగ్ బ్రేకింగ్ : గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్‌.. కార‌ణాలు ఇవే..!

0
669

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మిని చ‌విచూడ‌నుందంటూ ఇటీవ‌ల కాలంలో అనేక స‌ర్వేలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్రంలో జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళిని విశ్లేషించిన రాజ‌కీయ ఎన‌లిస్టులు సైతం స‌ర్వేల‌తో ఏకీభ‌వించారు. మ‌రోప‌క్క వైసీపీ నేత‌లు ఇటీవ‌ల మీడియా ముందు మాట్లాడుతూ టీడీపీ నేత‌లు చిత్తు చిత్తుగా ఓడిపోనున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళిపై ఇప్ప‌టికీ అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తుండ‌టంతో టీడీపీ శ్రేణులు సైతం కాస్త ఆందోళ‌న‌కు గురికావాల్సిన ప‌రిస్థితి. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు వింటున్న వైసీపీ శ్రేణులు, రాజ‌కీయ విశ్లేష‌కులు ఓట‌మిభ‌యంతోనే ఆయ‌న అలా అంటున్నార‌ని, ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి వైసీపీ అధికారంలోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌న్న అభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేస్తున్నారు.

ఎన్నిక‌ల స‌ర‌ళిని కూలంకుషంగా ప‌రిశీలించిన విశ్లేష‌కులు టీడీపీ కొన్నిచోట్ల దారుణంగా ఓడుతుంద‌ని, మ‌రికొన్ని చోట్ల మూడో స్థానానికి ప‌రిమితం కాక త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. అదే సంద‌ర్భంలో గ‌తంలో టీడీపీ ఎక్కువ సీట్ల‌ను సాధించిన ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఈ ప‌రిస్థితి ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని వారు చెబుతున్నారు.

కాగా, గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ – జ‌న‌సేన క‌లిసి పోటీ చేయ‌డం వ‌ల్లే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో టీడీపీకి ఎక్కువ సీట్లు ద‌క్కాయ‌ని, ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు విడి విడిగా పోటీ చేశాయి క‌నుక ఆ రెండు పార్టీల ఓట్లు చీల‌డంతోపాటు వైసీపీకి ఆధిక్య‌త క‌నిపించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని, దాంతో వైసీపీ అత్య‌ధికంగా సీట్ల‌ను సంపాదించుకోవ‌డంతోపాటు, క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న వాద‌న‌ను రాజ‌కీయ విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు.