వైసీపీ స‌మ‌రశంఖారావం : ల‌గ‌డ‌పాటిని చెడుగుడు ఆడుకున్న వైఎస్ జ‌గ‌న్‌..!

0
197

ఏపీ ఆక్టోప‌స్‌గా పేరు పొందిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చేసిన కుట్ర సిగ్గుచేట‌న్నారు. కాగా, ఇవాళ నెల్లూరు న‌గ‌ర ప‌రిధిలోగ‌ల ఎస్‌వీజీఎస్ క‌ళాశాల గ్రౌండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో స‌మ‌ర శంఖారావం స‌భ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

స‌భ‌లో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో 32 గంట‌ల‌కు ముందు, అంటే ఓట‌ర్లను ప్ర‌భావితం చేసేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌తో మ‌హాకూట‌మికి అనుకూలంగా ఓ స‌ర్వేను విడుద‌ల చేయించార‌న్నారు. త‌మ‌ను మ‌భ్య‌పెట్టేందుకు చంద్ర‌బాబు అండ్ మ‌హాకూట‌మి బ్యాచ్ కో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌తో స‌ర్వేను రిలీజ్ చేయించార‌ని గ్రహించిన ఓట‌ర్లు వారి కుట్ర‌ను తిప్పి కొట్టార‌న్నారు.

చంద్ర‌బాబు తాజాగా ఏపీలో కూడా అటువంటి కుట్ర‌కు తెర‌తీస్తున్నార‌న్నారు. అందులో భాగంగానే ఏపీ ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డీటైల్స్‌ను చంద్ర‌బాబు అనుచ‌ర‌వ‌ర్గానికి చెందిన కంపెనీల‌కు బ‌ద‌లాయించార‌ని, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన సానుభూతి ఓట‌ర్ల‌ను తొల‌గించేందుకు య‌త్నిస్తున్నార‌న్నారు. చంద్ర‌బాబు కుట్ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త ఏపీ ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు.