సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు వైవీ సుబ్బారెడ్డి మార్కులు ఎన్నో తెలుసా..?

0
216

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌డ‌తాన‌ని త‌న జీవిత కాలంలో ఇప్ప‌టి వ‌ర‌కు అనుకోలేద‌ని, ఆ అవ‌కాశాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ద్వారా అవ‌కాశం క‌ల్పించార‌ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను వైసీపీలో చేరిన నాటి నుంచి దివంగ‌త సీఎం వైఎస్ఆర్ పాల‌నను ఏపీలో మ‌ళ్లీ చూడాల‌న్న దిశ‌గా త‌మ పోరాటం కొన‌సాగిందన్నారు.

వైవీ సుబ్బారెడ్డి ఓ ప్ర‌ముఖ మీడియా ఇంట‌ర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. 2019 ఎన్నిక‌ల్లో ఎంపీగా నిల‌బ‌డొద్దని వైఎస్ జ‌గ‌న్ రెండు సంవ‌త్స‌రాల క్రిత‌మే చెప్పార‌న్నారు. ఆ క్ర‌మంలోనే తాను ఒంగోలు పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీ చేయ‌లేద‌న్నారు. అయితే, ఒంగోలు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఎప్ప‌ట్నుంచో ఉన్న సుధీర్ఘ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించి ప‌రిష్కార‌మార్గాల‌ను చూపాన‌న్నారు.

అలా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ‌డంతోనే తాను మ‌ళ్లీ వైసీపీ త‌రుపున ఎంపీ అభ్య‌ర్ధిగా నిల‌బ‌డ‌తాన‌ని ప్ర‌క‌టించిన‌ట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్ జ‌గ‌న్ మాత్రం త‌న‌ను ఉభ‌య గోదావ‌రి జిల్లాల పార్టీ వ్య‌వ‌హారాల‌పై పూర్తి దృష్టిసారించ‌మ‌ని ఆదేశించార‌ని, ఆ మేర‌కు తాను పార్ల‌మెంట్ అభ్య‌ర్ధిగా బ‌రిలో నిల‌వ‌లేద‌ని వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇదే సంద‌ర్భంలో వైఎస్ జ‌గ‌న్ నెల రోజుల‌పాట‌న‌కు సంబంధించి ఎన్నిమార్కులు ఇస్తారు..? అన్న ప్ర‌శ్న‌కు తాను మాత్ర‌మే కాకుండా, యావ‌త్ రాష్ట్ర ప్ర‌జ‌లు వంద మార్కులు ఇస్తారంటూ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.