వేషాలేసిన యామినీ సాధినేని… తెలుగు తల్లిగా మొదటి వేషం

0
181

తాజాగా ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నేపధ్యం లో కేంద్రంపై నిరసన వ్యక్తం చేసేందుకు గాను చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షకు తెలుగు తల్లి వేషం లో ఒక మహిళా వచ్చి ప్లకార్డు ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది…ఆమె మరెవరో కాదు సాక్షాత్తు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ… “నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం” అని రాసున్న ప్లకార్డును ప్రదర్శించింది ఆమె… ఆమె వేష ధారణ చూసి అందరూ అవాక్కవడమే కాకుండా, పలువురు నేతలు ఆమెను అభినందించారు…

ఈ సంధర్భంగా తెలుగు తల్లిగా యామినీ సాధినేని మాట్లాడుతూ తన కుమారుడు చంద్రబాబునాయుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మోదీని నిలదీస్తూ, అలుపెరగని పోరాటం చేస్తుంటే, మరో కుమారుడు వైఎస్ జగన్ అదే మోదీకి మద్దతిస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు. తన కుమారుడు దారితప్పి తిరుగుతున్నాడని, అతన్ని దారిలోకి తెచ్చే బాధ్యత ప్రజలదేనని అన్నారు. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా తమ చప్పట్ల జల్లు కురిపించారు.