సీఎం చంద్ర‌బాబు.. ఒక శిల్పి : సాధినేని యామిని

0
322

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఒక శిల్పి, అభివృద్ధి అనే శిల్పాన్ని ఆయ‌న నిరంత‌రం చెక్కుతూనే ఉంటార‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కురాలు సాధినేని యామిని అన్నారు. కాగా, ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఏ స‌మ‌యంలో, ఏ మాట్లాడాలో తెలియ‌ని వ్య‌క్తుల్లో మొద‌టి స్థానం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిద‌ని, అటువంటి వ్య‌క్తి ముఖ్య‌మంత్రి అవుతానంటే ఒప్పుకునే స్థితిలో ఏపీ ప్ర‌జ‌లు లేర‌ని సాధినేని యామిని ఎద్దేవ చేశారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని భ‌య‌ప‌డే ఏపీ ప్ర‌జ‌లు 2014లో వైసీపీని ఓడించార‌న్నారు.

ఏపీ ప్ర‌జ‌ల్లో త‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్‌లోనే ఐదేళ్ల‌పాటు ఉన్నార‌ని ఆమె విమ‌ర్శించారు. ఈ నెల 23న వెలువ‌డ‌నున్న ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైసీపీ ఘోర ఓట‌మిని చ‌వి చూడ‌నుంద‌ని, ప్ర‌స్తుతం అమ‌రావ‌తికి మ‌కాం మార్చిన జ‌గ‌న్‌, మ‌ళ్లీ లోట‌స్‌పాండ్‌కు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని జోస్యం చెప్పారు.