కేసీఆర్, జగన్, మోదీ లకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి..! యామిని

0
241
sadineni yamini press meeting at amaravathi

అమరావతిలో టీడీపీ కార్యాలయములో ఈరోజు జరిగిన మీడియా సమావేశములో టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మాట్లాడుతూ.. కేసీఆర్, జగన్, మోదీ ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ గెలుపు తధ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఖాయమంటూ స్పష్టం చేసింది. ఇక ప్రధాని మోదీ కి మాత్రం ఎనలేని పంచులిస్తూ ఎంతగా దుయ్యబట్టిందో వింటే ఆశ్చర్యం కలగాల్సిందే.

మోదీ పాలన చూస్తుంటే దాదాపుగా జర్మనీ నియంతైనా హిట్లర్ పాలనను తలపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క కంపెనీ భారత దేశంలోకి రాలేదు . మహిళలు అందరు అతనికే ఓటు వేశారంటూ ప్రధాని మోదీ ఒక ఎన్నికల ప్రచార సమావేశంలో చెప్పడం ఎంతో విడ్డురము కలిగించింది. ఈ నెల 23 వ తేదీన లోక్ సభ ఎలక్షన్ రిసల్ట్ వచ్చాకా మోదీ హిమాలయాలకు వెళ్లి సన్యాసం లో కలవాల్సిందే అని ఎద్దేవా చేసింది.

వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీలు రాజకీయాల్లో చేసే కుట్రలకు, నటనకు ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వొచ్చని చెప్పింది. ఇక ఏపీ పౌరుషమేంటని ఈ నెల 23 వరకు ఆగితే వాళ్లకే తెలుస్తుందంటూ.. అధికార పగ్గాలు ఈ సారి కూడా టీడీపీ వారిదే అంటూ జోస్యం చెప్పింది.