అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్న మ‌హిళ‌ల గుట్టుర‌ట్టు

0
275

రెండు రోజుల క్రితం శబరిమల ఆలయంలోకి ప్ర‌వేశించిన 50 సంవ‌త్స‌రాల్లోపు ఇద్ద‌రు మ‌హిళ‌లు క‌ప‌ట భ‌క్తులుగా తేలిపోయింది. అయితే, వారిద్ద‌రూ స్వామివారి మాల వేసుకుని శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి వెళ్లామ‌ని చెప్పుకున్న‌ప్ప‌టికీ, వారి బండారం మొత్తం హోట‌ల్ సీసీ పుటేజ్‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది.

వారిద్ద‌రికి సంబంధించి ల‌భించిన స‌మాచారం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి. గత డిసెంబెర్ 31న శ‌బ‌రిమ‌ల‌కు సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో దిగిన బిందు, క‌న‌క‌దుర్గ అప్పటిక‌ప్పుడే స్వామివారి అయ్య‌ప్ప మాలాధారులు ధ‌రించే నల్లని దుస్తులు ధరించారు. ఆ విష‌యం సీసీ పుటేజ్‌లో తేట‌తెల్ల‌మైంది. వారిద్ద‌రూ కూడా మాలాధారణ చేసినట్టు కాకుండా, సాధారణ నల్లని దుస్తులు మాత్రమే ధ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

కేవ‌లం స్వామి వారిని ద‌ర్శించుకోవాల‌న్న ఆలోచ‌న‌తో నల్లని దుస్తులతో ఆలయంలోకి ప్ర‌వేశించార‌ని హోటల్ సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా బయటపడింది. అయితే ఈ విష‌యం తెలిసిన‌ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. బిందు, క‌న‌క‌దుర్గ ఇద్ద‌రూ కూడా లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వారని, కావాల‌నే ప్రభుత్వం వారిచేత ఈ పని చేయించిందిహిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.