ఐస్‌క్రీమ్ నాకి.. అడ్డంగా బుక్కైంది – రూ.6.8 లక్షల జరిమానా..! (వీడియో)

0
213

ఐస్‌క్రీమ్ నాకిన ఓ యువతికి జైలు శిక్ష వేయ‌డంతోపాటు రూ.6.8 ల‌క్ష‌ల జ‌రిమానాను విధిస్తూ ఉన్న‌త న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. ఈ సంఘ‌ట‌న టెక్సాస్‌ లుఫ్కిన్ ప‌రిధిలో చోటు చేసుకుంది. అదేంటి ఐస్‌క్రీమ్ నాకితే జైలు శిక్ష‌తోపాటు జ‌రిమానా కూడా విధిస్తారా..? ఇదెక్క‌డి విడ్డూర‌మ‌బ్బా..! అయినా ఐస్‌క్రీమ్ తినాలా..? తాగాలా..? నాకాలా..? అన్న‌ది దాన్ని కొన్నవారి ఇష్టం. అంతేకానీ, ఐస్‌క్రీమ్ నాకే స్వాతంత్రం కూడా లేని దేశాలు ఇంకా ఉన్నాయా..? అయినా ఐస్‌క్రీమ్ నాక కూడ‌ద‌ని ఏ రాజ్యంగం చెప్ప‌లేదే..!

అవును, ఐస్‌క్రీమ్ నాకకూడదన్న ఆంక్ష‌లు ఎక్క‌డా లేవ‌న్న‌ది నిజ‌మే..! మేమేం నాక‌కూడ‌ద‌ని చెప్ప‌లేదే.. ఎవ‌రి కొనుక్కున్న ఐస్‌క్రీమ్ వారి ఇష్టం..! వారు నాక్కుంటారో.., తాగ‌తారో.. తింటారో వారి ఇష్టం..! కానీ వాల్‌మార్ట్ ఫ్రిజ్‌లోని ఐస్‌క్రీమ్‌ను బ‌య‌ట‌కు తీసి పైపైన నాకి.. మ‌ళ్లీ లోప‌ల‌పెడితే మాత్రం చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోకుండా ఎలా ఉండ‌గ‌లుగుతాం. అలాచేస్తే ప్ర‌జ‌ల ఆరోగ్యానికి హాని క‌లిగించిన వార‌వ‌రా..? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు టెక్సాస్ పోలీసులు.

ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..! 25 ఏళ్లు దాటిన ఓ ఇద్ద‌రు ప‌డుచు భామ‌లు షాపింగ్ కోసం టెక్సాస్‌లోని లుఫ్కిన్ వాల్‌మార్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అస‌లే కుర్ర వ‌య‌సులో ఉన్న వారికి వాల్‌మార్ట్‌ ఫ్రిజ్‌లోని ఐస్‌క్రీమ్‌ను చూడ‌గానే కొంటె ఆలోచ‌న‌లు త‌ట్టాయి. ఇంకేముంది వెన‌కా ముందు ఆలోచించ‌కుండా ఫ్రిజ్ తెరిచి అందులోని ఐస్‌క్రీమ్ బాక్స్‌ను తీసి ఓపెన్‌చేసి మ‌రీ నాకింది. తాను నాకిన బాక్సునే ఎటువంటి అనుమానం రాకుండా మ‌ళ్లీ అదే ఫ్రిజ్‌లో.. అదే ప్లేస్‌లో సీల్‌వేసి మ‌రీ పెట్టింది.

అంతా గుట్టుచ‌ప్పుడు కాకుండానే జ‌రిగిందిగా..! మ‌రీ పోలీసుల‌కు ఎలా తెలిసింద‌నేగా మీ డౌట్‌. అక్క‌డికే వ‌స్తున్నా.. అస‌లే కుర్ర‌వ‌య‌సని చెప్పుకున్నాం క‌దా..! ఐస్‌క్రీమ్ నాక‌డాన్ని తీపి జ్ఞాప‌కాలుగా భావించిన వారు దాన్ని కాస్తా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముందీ.. ఈ వీడియో ఆ కంటా.. ఈ కంటా ప‌డి చివ‌ర‌కు పోలీసుల‌కంట ప‌డింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఐస్‌క్రీమ్ నాకిన ఆ కుర్ర‌పాప‌కు అక్క‌టి చ‌ట్టాల ప్ర‌కారం సంకెళ్లేసి జైలుకు త‌ర‌లించారు. అదండీ అస‌లు మేట‌ర్‌..!