బిగ్‌బాస్ – 3 : ఆ ఐదుగురు క‌న్ఫామ్‌..!

0
268

ఇంకోవారం రోజుల్లో మొద‌లుకానున్న బిగ్‌బాస్ సీజ‌న్ త్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే విడుద‌లైన ప్రోమో కూడా ఇప్ప‌టికే దుమ్ము దులిపేస్తోంది. దీంతో ఇప్పుడు అంద‌రి ఆస‌క్తి కంటెస్టెంట్‌ల‌పైనే ప‌డింది. ఈ సారి హౌస్‌లోకి వ‌చ్చే కంటెస్టెంట్స్ ఇప్ప‌టికే అనేక‌పేర్లు బ‌య‌ట‌కొచ్చాయి. అందులో ఐదుగురు మాత్రం క‌న్ఫామ్ అయిపోయార‌ట‌.

వారిలో హీరో వ‌రుణ్ సందేశ్‌, శ్రీ‌ముఖి, యాంక‌ర్ సావిత్రి, న‌టి హేమ‌, టీవీ న‌టి, విన‌య విధేయ‌రామ, శ‌త‌మానం భ‌వ‌తి వంటి సినిమాల్లో చిన్న‌చిన్న స‌న్నివేశాల్లో క‌నిపించిన హిమ‌జ కూడా బిగ్‌బాస్ హౌస్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ షో కూడా దాదాపు 40 మందిని నిర్వాహ‌కులు సెలెక్ట్‌చేసిన‌ట్టు స‌మాచారం. వారిలో 14 మంది హౌస్‌లోకి వెళ్ల‌నున్నారు. ఈసారి కామ‌న్‌మెన్ ఎవ‌రు కూడా హౌస్‌లోకి వెళ్ల‌ర‌ని స‌మాచారం. త‌మిళ‌, హిందీ బిగ్‌బాస్ అన్ని షోల‌కు ఒకే హోస్ట్ ఉండ‌గా, తెలుగుకు మాత్రం మూడు సీజ‌న్‌ల‌కు ముగ్గురు అయ్యారు.