టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట కూడా వైసీపీలోకి జంప్ చేస్తారా..?

0
197

ప్ర‌కాశం జిల్లాపై కొన్ని నెల‌లుగా వైసీపీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ ఇప్ప‌టికే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి పార్టీని వీడ‌తారా..? అన్న ప్ర‌శ్న రాజ‌కీయ వ‌ర్గాల్లో క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది. ఆ క్ర‌మంలోనే కొన్ని నెల‌లుగా వైసీపీ శ్రీ‌నివాసులురెడ్డిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

అటు, టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగేందుకు మాగుంట‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అయితే, శ్రీ‌నివాసులురెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తే నెల్లూరు ఎంపీగా బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నార‌ట‌. ఒంగోలు నుంచి పోటీ చేయాల్సి వ‌స్తే టీడీపీక‌న్నా వైసీపీ బెట‌ర్ ఆప్ష‌న్ అని శ్రీ‌నివాసులురెడ్డి అనుచ‌ర‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌. దీంతో ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది.