ప‌వ‌న్‌పై ప్రొ.నాగేశ్వ‌ర్ కౌంట‌ర్ : మీ సంగీతం చాలా బాగుందండి..!

0
485

టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధ్య‌క్షుడిగా ఉన్న జ‌న‌సేన పార్టీకి కీల‌క నేత‌గా ఉన్న రావెల కిశోర్‌బాబు కొన్ని రోజుల క్రితం రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ పార్టీకి రాజీనామా చేసిన ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా జ‌న‌సేన నుంచి ఒక్కొక్క‌రుగా జారుకుంటున్నారంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల‌పై ప్రముఖ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ త‌న‌దైన శైలిలో విశ్లేషించారు.

జ‌న‌సేన‌లో చేరిన వారంతా ప‌వ‌న్‌పై ప్రేమ‌తో వ‌చ్చార‌ని అన‌డం విచిత్రంగా ఉంద‌ని, అలా వ‌చ్చిన వారిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌మ్మ‌డం ఇంకా విచిత్రంగా ఉంద‌ని ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ పేర్కొంటూ ఓ ఉదాహ‌ర‌ణ‌ను వ‌ల్లించారు. ప్రొ.నాగేశ్వ‌ర్ ఉదాహ‌ర‌ణ చెబుతూ, ప్ర‌యాణిస్తున్న రైళ్లో ఎక్క‌డా కూడా బెర్త్ ఖాళీ లేక‌పోవ‌డంతో అప్పుడే ఎక్కిన ఒక ప్ర‌యాణికుడు వీణ వాయిస్తున్న మ్యుజీషియ‌న్ వ‌ద్ద‌కు వెళ్లి మీ సంగీతం చాలా మ‌ధురంగా ఉందండీ.. నేను విన‌వ‌చ్చా అంటే వీణ వాయించే అత‌ను ఆనంద‌ప‌డి లేచి కూర్చొని, స‌గం సీటు ఇచ్చాడ‌ట‌. పాపం సంగీతం వాయించే అత‌ను మాత్రం నా సంగీత మ‌ధురమాధుర్యానికి ప‌ర‌వ‌శించి వ‌చ్చాడ‌ని న‌మ్ముతాడు. అస‌లు విష‌యం ఏమిటంటే.. అత‌నికి సీటు కావాలి కాబ‌ట్టి ఒక బిస్కెట్ వేశాడు. అలాగే జ‌న‌సేన‌లో చేరిన వారంతా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్రేమ‌తో వ‌చ్చార‌ని వాళ్లు అన‌డం విచిత్రంగా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌మ్మ‌డం ఇంకా విచిత్రంగా ఉందని ప్రొ.నాగేశ్వ‌ర్ చెప్పారు.

జ‌న‌సేన‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చేరిన వారంతా కాంగ్రెస్‌లో అవ‌కాశాలు లేక టీడీపీలో చేర‌లేక వ‌చ్చార‌ని, ఇలా వ‌చ్చిన వారంద‌ర్నీ మీరెందుకు చేర్చుకున్నారంటూ ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికైనా చేయాల్సింది ఏమిటంటే..? ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని ఎదురు చూసి మోస‌పోకుండా ల‌క్ష‌ల మంది అభిమానులు ఉన్న‌ప్పుడు రావెల కిశోర్ ఎందుకు..? నాదెండ్ల మ‌నోహ‌ర్ ఎందుకు..? ఆకుల స‌త్య‌నారాయ‌ణ ఎందుకు..? వారినే నాయ‌కులుగా తీర్చిదిద్దుకోండంటూ చెప్పారు.