భ‌ర్త కోసం భార్య ఆందోళ‌న‌..!

0
111

సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్‌లోని సాయిబాబా న‌గ‌ర్‌లో న్యాయం కోసం భ‌ర్త ఇంటిముందు ఓ భార్య భర్త కోసం ఆందోళ‌న‌కు దిగింది. అసౌలి రామాచారికి మెద‌క్ జిల్ టేక్‌మాల్ మండ‌లం బోడ్‌మ‌ట్‌ప‌ల్లి గ్రామానికి చెందిన తేజ‌శ్రీ‌తో ఐదేళ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

తేజ శ్రీ‌ని ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న రామాచారి మొద‌ట్లో బాగానే ఉన్నాడు. ఈ మ‌ధ్య అద‌న‌పు క‌ట్నం కోసం వేధిస్తున్నాడ‌ని, సూటిపోటి మాట‌ల‌తో మాన‌సికంగా, శారీర‌కంగా వేధిస్తున్నాడ‌ని తేజ శ్రీ ఆరోపించింది. ఇదే విష‌యం త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో వారికి ఉన్న కాస్త భూమిని అమ్మి కొంత ఇచ్చార‌ని, అయినా ఇంకా అద‌నంగా డ‌బ్బు కావాల‌ని త‌న‌ను తీవ్రంగా వేధిస్తున్నాడ‌ని తేజ శ్రీ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.

భ‌ర్త‌, అత్త‌మామ‌ల వేధింపుల‌తో విసిగిపోయి చివ‌ర‌కు పెద్ద మ‌నుషుల‌ను ఆశ్ర‌యించింది. అయినా న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో కోర్టు మెట్లాక్కాన‌ని తేజ శ్రీ మీడియాకు చెబుతోంది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు న్యాయం చేయాలంటూ త‌న కుమారుడితో క‌లిసి భ‌ర్త ఇంటిముందు ఆందోళ‌న‌కు దిగింది. అయితే, అసౌలి రామాచారి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో తేజ శ్రీ‌ని పోలీసు స్టేష‌న్‌కు త‌రిలించారు. కేసు కోర్టులో ఉన్నందున తామేమీ చేయ‌లేమ‌ని పోలీసులు భార్యా, భ‌ర్త‌లిద్ద‌రికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.