విమాన ప్ర‌యాణికుల ముక్కుల్లో నుంచి ర‌క్తం..! అస‌లేం జ‌రిగిందంటే..?

0
165

ప్ర‌యాణికుల‌ను గ‌మ్య స్థానాలకు చేర్చేందుకు గాల్లోకి ఎగిరిన విమానంలో ఒక్క‌సారిగా పీడ‌నం త‌గ్గింది. దీంతో విమానంలో ఉన్న ప్ర‌యాణికులంద‌రి ముక్కుల్లో నుంచి ఒక్క‌సారిగా ర‌క్తం రావ‌డం ప్రారంభ‌మైంది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది విమానాన్ని బ‌య‌ల్దేరిన ఎయిర్‌పోర్టులోనే మ‌ళ్లీ ల్యాండ్ చేశారు. ఈ సంఘ‌ట‌న మ‌స్క‌ట్‌లో చోటు చేసుకుంది.

మ‌స్క‌ట్ విమానాశ్ర‌యంలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌కు సంబంధించి సిబ్బంది తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. ఆదివారం నాడు 185 మంది ప్ర‌యాణికుల‌తో మస్క‌ట్ ఎయిర్‌పోర్టు నుంచి ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ కాలిక‌ట్‌కు బ‌య‌ల్దేరింద‌ని, గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాల‌కే పీడ‌నం త‌గ్గిపోవ‌డంతో కొంద‌రి ముక్కుల్లో నుంచి ర‌క్తం రాగా, మ‌రికొంద‌రు విప‌రీత చెవి నొప్పితో బాధ ప‌డ్డార‌న్నార‌ని తెలిపారు.

పీడ‌నం త‌గ్గిన విష‌యాన్ని గ‌మ‌నించిన సిబ్బంది విమానాన్ని వెంట‌నే మ‌స్క‌ట్‌కు మ‌ళ్లించి ల్యాండ్ చేశార‌ని, అనారోగ్యానికి గురైన వారికి విమానాశ్ర‌యంలోనే వైద్య సేవ‌లు అందించిన‌ట్లు అధికారులు తెలిపారు. వారంద‌రి ఆరోగ్యం కుదుట ప‌డ్డాకే మ‌స్క‌ట్ నుంచి కాలిక‌ట్‌కు విమానం బ‌య‌ల్దేరింద‌ని వెల్ల‌డించారు.