ఎన్టీఆర్ ల‌క్ష్మీ పార్వ‌తినే ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే..?

0
205

ఇవాళ ( జ‌న‌వ‌రి 9) ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజై థియేట‌ర్ల‌లో సందడి చేస్తుంటే మరో వైపు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి ఎందుకు..? అనే రెండో పాట‌ను విడుద‌ల చేశాడు. అయితే, ఇటీవ‌ల ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రానికి సంబంధించి మొద‌టి పాట‌ వెన్ను పోటు పాటను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే.

కాగా, ఎందుకు..? అనే రెండో సాంగ్‌లో ఎన్టీఆర్ అంద‌ర్నీ కాదని ల‌క్ష్మీపార్వతినే ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నాడు..? అంటూ కొన్ని ప్రశ్నలు సంధించాడు. కుమార్తెలు, కుమారులు, జయసుధ, జయప్రద, శ్రీదేవి, వీళ్లందర్నీకాదని ఆ లక్ష్మీ పార్వతినే ఎందుకు..? ఎందుకు.? అనే ప్రశ్నలను సంధిస్తూ ఈ వీడియోన‌ను రూపొందించారు. ఇంతకు ముందు వెన్నుపోటు పాటతో పోలీసు కేసుల‌ వరకు తెచ్చుకున్న వర్మ ఈ సారి ఎందుకు..? అనే వెరైటీ పాటను ఎంచుకున్నారు. దీంతో ఈ వీడియోపై టీడీపీ నేతలు భ‌గ్గుమంటున్నారు.

వర్మ విడుదల చేసిన ఈ పాట లోని ప్రశ్నల వెనుక అబద్ధాలుగా చెలామణి అవుతున్న నిజాలను, నిజాలుగా, మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ధ్యేయ‌మ‌ని ఈ పాట‌లో వర్మ వాయిస్ వుంది. నిజాన్ని అబద్దంగా మార్చేశారు అని, అబద్దానికి నిజమనే పొరను కప్పేశారని, వాట‌న్నిటినీ విప్పేసి నిజాన్ని నగ్నంగా చూపిస్తాన‌ని వర్మ తాజా వీడియోలో ప్రకటించాడు.