కొత్తగా పెళ్ళయినవారు ఆషాడమాసంలో ఎందుకు దూరంగా ఉండాలి?

0
136

మ‌న పూర్వీకులు చెప్పిన మాట‌లు, ఆచ‌రించిన సాంప్ర‌దాయాలను నేటి త‌రం అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే అవ‌న్నీ కూడా అనుభ‌వాల నుంచి వ‌చ్చిన‌వే అన్నది మ‌నంద‌రికి తెలుసు. వీటిలో ఒక ఆచారం మాత్రం పెళ్లి చేసుకునే ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎదుర‌వుతుంది. అదే ఆషాఢం. ఆషాఢ మాసాన్ని శూన్య‌మాసం అని కూడా అంటారు.

పెళ్లైన కొత్త‌లో భార్యా, భ‌ర్త‌ల మ‌ధ్య విప‌రీత‌మైన ప్రేమ ఉంటుంది. ఈ మాసంలో పెళ్లైన జంట దూరంగా ఉండ‌టం వ‌ల్ల ఆ బాధ వారికి తెలుస్తుంది. ఆషాఢంలో కొత్త జంట ఎంత దూరంగా ఉంటే అంత ప్రేమ వారి మ‌ధ్య చిగురిస్తుంది. ఆ చిగురించిన ప్రేమ ఇద్ద‌రి మ‌ధ్య సంబంధాన్ని బ‌ల‌ప‌రిచి క‌ష్ట సుఖాల‌ను పంచుకునేలా చేస్తుంది. ఆషాఢ మాసంలో పెరిగిన ప్రేమ కార‌ణంగా నూత‌న జంట వారి జీవితాంతం సుఖ సంతోషాల‌తో జీవ‌నం సాగిస్తార‌ని మ‌న పూర్వీకులు చెప్పిన వాస్త‌వం.