జగన్ ఎప్పుడో ముఖ్యమంత్రి..! : ఎందుకంటే ?

0
274
జగన్ ఎప్పుడో ముఖ్యమంత్రి..! : ఎందుకంటే ?
జగన్ ఎప్పుడో ముఖ్యమంత్రి..! : ఎందుకంటే ?

నిజానికి YS జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రనికి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు.. కాని ఆయనే వద్దు అనుకోని వదిలేశాడు అని చాలామంది చెబుతుంటారు. మరికొందరు మాత్రం నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన కుట్రవాళ్లే జగన్ CM అవ్వలేదు.. లేదంటే ఇప్పటికే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేవాడు అంటుంటారు. కానీ అసలు YS మరణం తరువాత ఏం జరిగింది అన్నది మాత్రం ఎవ్వరికీ పూర్తిగా తెలియదు.

అసలు తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఏం జరిగింది.. నాటి కుట్రలా వెనక ఎవరెవరు ఉన్నారు అనే విషయాలని ఒక ప్రముఖ జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో బయటపెట్టదు YCP అధినేత జగన్. ఆయన చెప్పిన విషయాలని ఒక్కసారి పరిశీలిస్తే అవును నిజమే కదా ? అనిపించక మానదు. ఎందుకంటే జగనే గనక ఆనాడు రాజీ పడి ఉంటే కేంద్ర మంత్రి పదవితో పాటు, ఎపుడో ముఖ్యమంత్రిని కూడా అయ్యేవాడినని జగన్ తన గతాన్ని గుర్తుచేశాడు.

ఇచ్చిన మాటకు కట్టుబడి నేను కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాను.. బలమైన కాంగ్రెస్ సామ్రాజ్యం మీద పోరాటం చేశాను..  గత 10ఏళ్లలో ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నానని జగన్ చెప్పుకొచ్చారు. తనకు జనంలో ఉండడం చాలా సంత్రుప్తిని ఇచ్చిందని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్న ఆనదం.. సంత్రుప్తి తనలో ఉన్నాయని జగన్ అన్నారు. పదవులు కంటే ఇచ్చిన మాట తనకు ముఖ్యమని జగన్ చెప్పిన తీరు ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

Read Also: ఏపీలో భారీగా ప‌ట్టుబ‌డుతున్న న‌గ‌దు..!