ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతోన్న భేటీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు మిగతా రాష్ట్రాల సీఎంలు, యూటీ లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర హోంశాఖ, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే, తెలంగాణ సీఎం ఈ భేటీకి ఎందుకు హాజరు కాలేదన్న చర్చ జోరుగాసాగుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి కేసీఆర్ ప్రధాని అపాయింట్మెంట్ కోరారని.. కానీ అటు నుంచి స్పందన లేదని అందుకే కేసీఆర్ విముఖత వ్యక్తంచేశారని చెబుతున్నారు. ఇలా ఉంటే, తెలంగాణలో పార్టీ విస్తరణపై బీజేపీ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బీజేపీ పావులుకదుపుతోందంటున్నారు. ఇదిలాఉంటే, ప్రతిష్టాక కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ పనుల్లో బిజీగా ఉన్నందున నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం వెళ్లలేదు. తన బదులు ఆర్థిక శాఖ కార్యదర్శిని పంపించారు.