వాయిస్ కాల్స్ తో వైరస్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..! వాట్సాప్‌ యాజమాన్యం

0
182
whats app

వాట్సాప్ వాడుతున్న వారంతా వెంటనే యాప్‌ను తొందరగా అప్‌డేట్ చేసుకోవాలంటూ సూచించారు యాజమాన్య పరంగా విజ్ఞప్తి తెలిపారు. వాయిస్ కాల్ ఫీచర్ తో ఫోన్ లలో వైరస్ అటాక్ అవుతుందని సంస్థ తెలుసుకుంది. వాట్సాప్‌ వాయిస్ కాల్స్‌ లకు మరింత జాగ్రత్త తీసుకునే పరంగా మరిన్ని ఫీచర్లను పొందుపరుస్తుంటే ఇజ్రాయెల్‌కు సంబందించిన ఎన్‌ఎస్ఓ గ్రూపు డెవలప్ చేయబడిన స్పైవేర్ ఫోన్ లో ఎంట్రీ అయ్యిందట. స్పైవేర్ అటాక్ కాబడినట్లు మే మొదటి వారములో గుర్తించారట.

వాట్సాప్‌లో కాల్ వచ్చినపుడు లిఫ్ట్ చేసినా, చేయకపోయినా, కనీసం మిస్డ్ కాల్ వచ్చినా వైరస్ అటాక్ కాబడుతుందని తెలిపింది. ఈ వైరస్ అటాక్ జరిగిందంటే వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ తో పాటు , సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వారు హ్యాక్ చేస్తారని తెలిపారు. ఈ సమస్యను గుర్తుంచి వెంటనే యాజమాన్యము చర్యలు తీసుకుంది. కాబట్టి వాట్సాప్ యూజర్స్ వెంటనే అప్‌డేట్ చేసుకొమ్మని వాట్సాప్ వారి ప్రతినిధి ఒకరు తెలియ చేశారు.