”వెల్‌క‌మ్ హీరో (అభినంద‌న్‌)”

0
267

శ‌త్రువుల‌కు చిక్కినా స‌రే దేశ ర‌హ‌స్యాల‌ను వాళ్ల‌కు చిక్క‌నివ్వ‌ని అభిన‌వ అర్జునుడు అభినంద‌న్ వ‌ర్ధ‌న్‌ మ‌రికొద్ది సేప‌ట్లో వ‌చ్చేస్తున్నాడు. భార‌త ఆయుధ‌గారాల‌పై దాడుల‌కు య‌త్నించిన పాక్ సైన్యాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పికొట్టిన యోధుడు అభినంద‌న్‌. భార‌త పుత్ర అభినంద‌న్ వ‌ర్ధమాన్ మ‌రికొద్ది సేప‌ట్లో వాఘా వ‌ద్ద జ‌న్మ‌భూమిని ముద్దాడ‌బోతున్నాడు.

ప్రాణాల‌కు తెగించి శ‌త్రుసైన్యంతో పోరాడి స్వ‌దేశానికి తిరిగొస్తున్న అభినంద‌న్‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అభినంద‌న్ త‌ల్లిదండ్రులు ఢిల్లీ నుంచి అమృత్‌స‌ర్‌కు విమానంలో చేరుకున్నారు. అభినంద‌న్‌ను స్వాగ‌తించేందుకు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.

పాకిస్తాన్ చెర నుంచి భార‌త్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ నేడు విడుద‌ల‌వుతుండ‌టంతో ఆయ‌న స్వ‌స్థ‌లం చెన్నైలో సంబ‌రాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకుని వేడుక‌లు చేసుకున్నారు. ప్రాణాల‌ను ప‌ణంగాపెట్టి దేశ సేవ‌కు అంకిత‌మ‌య్యాడ‌ని స్థానికులు ప్ర‌శంసించారు.

అలాగే, అభినంద‌న్‌ను అభినందించ‌డానికి, స్వాగ‌తించ‌డానికి పంజాబ్ సీఎం అమ‌రేంద‌ర్ సింగ్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తాను కూడా నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో ట్రైనింగ్ పొందిన వాడినే కాబ‌ట్టి అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్‌ను రిసీవ్ చేసుకుంటాన‌ని ప్ర‌ధాని మోడీని ఆయ‌న కోరారు.