హైదరాబాద్ లో చిన్నారిని బలిగొన్న వాటర్ ట్యాంకర్

0
151
Hyderabad latest crime news
Hyderabad latest crime news

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అబిడ్స్ లో వాటర్ ట్యాంకర్ కింద పడి ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. రోజరి కాన్వెంట్ లో మూడవ తరగతి చదువుతున్న విద్య జెన్ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అబిడ్స్ చాపెల్ రోడ్డు లో స్కూల్ కు వెళుతున్న సమయంలో వాటర్ ట్యాంకర్ రూపంలో పాపను మృత్యువు కబళించింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

లారీ డ్రైవర్ తప్పు వున్నట్టుగా తెలుస్తుంది. విద్య జెన్ తండ్రి యాక్టీవ బైక్ పైన ఇంటి నుండి స్కూల్ కు వెళుతున్నా సమయంలో  చాపెల్ రోడ్డు కు వెళ్లే దారిలో కొంచం కట్ట వుండటం తో ఆ అప్పు మీదకు లారీ ఒక సైడ్ వెళ్తుంది. ఆ లారీ పక్కనుండి విద్య జెన్ తండ్రి వెళ్తుండగా ఈ క్రమంలోనే లారీ ఒకసారి వేగంగా వెళ్లడంతో ఆ బైక్ ను ఢీకొట్టడంతో వెనుకాల ఉన్న పాప ఒకసారిగా  కింద పడిపోయింది. వెంటనే ఆ పాప పై నుండి లారీ టైర్ వెళ్లడంతో ఆ పాప అక్కడిక్కడే చనిపోవడం జరిగింది.

విద్య జెన్ మూడవ తరగతి చదువుతున్న  ఎనిమిదేళ్ల పాప రోజుమాదిరిలాగానే తండ్రి తో స్కూల్ కు వెళ్తుంది కానీ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఈ ప్రమాదం జరిగింది.  విద్య జెన్ తండ్రి కి కూడా గాయాలయ్యాయి అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నటు పోలీసులు చెపుతున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నటు పోలీసులు చెపుతున్నారు