ఏపీలో భారీగా పెరిగిన ఓటింగ్‌.. జిల్లాల వారీగా వివ‌రాలివే..!

0
248

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓటు పోటెత్తింది. మొత్తం 77 శాతంగా న‌మోదైంది. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు జ‌ర‌గిన ఓటింగ్ ఒక ఎత్తైతే.. సాయంత్రం నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ మ‌రో ఎత్త‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

చాలా ప్రాంతాల్లో ఆల‌స్యంగా ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో క్యూ లైన్‌లో ఉన్న వారంద‌రూ వారి వారి ఓటు హ‌క్కును వినియోగించుకునేలా ఈసీ అనుమ‌తి ఇచ్చింది. దీంతో అర్ధ‌రాత్రి వ‌ర‌కు కొన్ని చోట్ల ఓటింగ్ సాగింది. వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా 76.69 శాతంగా న‌మోదైంది.

శ్రీ‌కాకుళం : 72 %
విజ‌య‌న‌గ‌రం : 85 %
విశాఖప‌ట్నం : 70 %
తూర్పుగోదావ‌రి : 81 %
ప‌శ్చిమ గోదావ‌రి : 70 %
కృష్ణా : 79 %
గుంటూరు : 80 %
ప్ర‌కాశం : 85 %
నెల్లూరు : 75 %
క‌డ‌ప : 70 %
క‌ర్నూలు : 73 %
అనంత : 78 %
చిత్తూరు : 79 %

మొత్తంగా 85 శాతం పోలింగ్‌తో ప్ర‌కాశం జిల్లా టాప్ ప్లేస్‌లో ఉండ‌గా, 80కు పైగా శాతం పోలింగ్‌లో విజ‌య‌న‌గ‌రం, తూర్పు గోదావ‌రి జిల్లాలు త‌రువాతి స్థానాల్లో ఉన్నాయి.