బ్రేకింగ్ న్యూస్ : YS వివేకానందరెడ్డిది హత్యే – SP రాహుల్

0
413
వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణం : సుధాకర్ రెడ్డిపై అనుమానాలు..!
వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణం : సుధాకర్ రెడ్డిపై అనుమానాలు..!

మాజీ మంత్రి “YS వివేకానంద‌రెడ్డి” ఇవాళ తెల్ల‌వారు జామున గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతడి తల, మొహం, చేతిపై లోతైన గాయలు ఉండడంతో ఆయనది సహజ మరణం కాదు అనే అనుమానాలు మొదలయ్యాయి. వివేకానంద‌రెడ్డి మృతిపై అనుమానం వచ్చిన అతడి PA కృష్ణారెడ్డి కూడా అనుమానాస్ప‌ద మృతిగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అందులో బాగంగా వివేకానంద‌రెడ్డి భౌతిక‌కాయానికి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వ‌హించ‌నున్నారు.

ఇలాంటి సందర్భంలో YS వివేకానంద‌రెడ్డిది సాదారణ మరణం కాదని ఎవరో హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్ట్ లో బయటపడింది. ఆయన ఒంటిమీద ఏకంగా 7 కత్తి పోట్లు ఉన్నట్లు రిపోర్ట్ లో బయటపడిందని SP రాహుల్ తెలిపారు. అందువల్ల రాత్రి నుండి ఉదయం వరకు ఏంజరిగిందో విచారిస్తున్నాం, ఇప్పటికే మా క్లూ టీమ్ కు కొన్ని “ఫింగర్ ప్రింట్స్” దొరికాయని SP రాహుల్ వివరించాడు.