విశాఖ‌లో ముగ్గురు ప్ర‌ముఖుల విగ్ర‌హాల తొల‌గింపు..!

0
160

ముగ్గురు ప్ర‌ముఖుల విగ్ర‌హాల‌కు జీవీఎంసీ అనుమ‌తి తీసుకోక‌పోవ‌డం విశాఖ‌లో వివాదానికి దారితీసింది. కాగా, విశాఖ‌న‌గ‌రానికి ఎటువంటి సంబంధంలేని విగ్ర‌హాల‌ను ఎలా ఏర్పాటు చేస్తారంటూ బులిశెట్టి స‌త్య‌నారాయ‌ణ హైకోర్టులో పిల్ వేశారు. స‌త్య‌నారాయ‌ణ వేసిన పిటిష‌న్‌పై విచారించిన హైకోర్టు వాటిని తొల‌గించాలంటూ ఆదేశాలు ఇవ్వ‌డంతో జీవీఎంసీ అధికారులు ఆ విగ్ర‌హాలను తొల‌గించారు.

అయితే, విశాఖ బీచ్ కేంద్రం రాత్రికి.. రాత్రే మూడు విగ్ర‌హాలను ఏర్పాటు చేయ‌డంతోపాటు అప్ప‌టిక‌ప్పుడు ఆవిష్క‌రిస్తే, వాటిని రాత్రికి రాత్రే జీవీఎంసీ అధికారులు తొలగించారు. విశాఖ బీచ్ రోడ్డులో ఎంద‌రో మ‌హ‌నీయుల విగ్ర‌హాలు కొలువుదీరి ఉన్నాయి. ఇటీవ‌ల వీటి స‌ర‌స‌న మ‌రో మూడు విగ్ర‌హాలు వ‌చ్చి చేరాయి.

లెజెండరీ యాక్ట‌ర్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు విగ్ర‌హాల‌తోపాటు రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూసిన నంద‌మూరి హ‌రికృష్ణ విగ్ర‌హాల‌ను సాగ‌ర‌తీరాన ఏర్పాటు చేశారు. అందులోను మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు రాత్రికి రాత్రే విగ్ర‌హాల‌ను ఆవిష్క‌రించ‌డం గ‌మ‌నార్హం.