ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు వైసీపీ అభ్య‌ర్ధిదే..!

0
270

వినుకొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ జ‌రిగిన తీరును నిశితంగా ప‌రిశీలించిన వైసీపీ శ్రేణులు ఆ పార్టీ అభ్య‌ర్ధి బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు గెలుపు న‌ల్లేరుపై నడ‌కేన‌ని గ‌ట్టి విశ్వాసాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. కాగా, వినుకొండ‌లో మొత్తం ఐదు మండ‌లాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. వాటిలో శ్యామ‌లాపురం, నూజెండ్ల‌, ఈపూరు మండ‌లాలు తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ, ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నికల్లో ఆ సీన్ రివర్స్ అయింద‌ని, ఆ మూడు మండ‌లాల ప్ర‌జ‌లు వైసీపీకే మొగ్గు చూపార‌ని, ఇక వినుకొండ రూర‌ల్‌, బొల్లాప‌ల్లి మండ‌లాల్లో ఎలాగో వైసీపీకి ప‌ట్టు ఉంది క‌నుక వైసీపీ అభ్య‌ర్ధి బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు కాన్ఫిడెన్ట్‌గా ఉన్నారు.