ప్రేక్షకులపై వినయం లేని రామ్

0
355

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వినయ విధేయ రామ’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను గత చిత్రాల కంటే ఎక్కువగా ఈ చిత్రంలో మాస్ మరియు కుటుంబ భావోద్వేగాలు పుష్కలంగా తీర్చిదిద్దారు.

ఇక  మనం  కథలోకి వెలితే :

కొణిదెల రాంచరణ్ అతను  నలుగురు  సోదరులు ఎంతో సన్నిహిత ప్రేమను పంచుకుంటున్న కుటుంబం వారిది. రాంచరణ్ పెద్దన్నయ్య భువన్ కుమార్ ఎన్నికల కమిషన్ లో ఒక నిజాయితీ గల IAS అధికారి. అతను ఎలక్షన్ డ్యూటీ మీదు గ విశాఖపట్నంలో జరిగే ఎన్నికల బాధ్యత నిర్వహించాల్సి వెళ్తాడు. అక్కడ ఉన్న  స్థానిక డాన్ అయిన పాండేమ్ పరశురాం, నిజాయతి గల భువన్ కుమార్ ని బెదిరిస్తుంటారు.. అసమయంలో తన  అన్నయ్యకు   అండగా రామ్ చరణ్ ఎదుర్కొనిన యాక్షన్  సీన్ పండించారనే చెప్పాలి. ఆ తర్వాత  ఫ్లాష్బాఫ్ తెరుచుకుని  బీహార్ లో జరిగిన కథ   చూడవచ్చు. బీహారు లో రాజా భాయ్ , రామ్ చరణ్ కి మధ్య ఎం జరిగిందో.. ఈ  సినిమా లో  అద్భుతంగా తెరకెక్కించారు.

రామ్ చరణ్  యాక్షన్ :

ఇక మనం రామ్ చరణ్ గురుంచి చూసుకుంటే రంగస్థలంలో ఒక నటుడిగా తనని తాను పునర్నిర్మించుకోగలిగాడు. కానీ రామ్ చరణ్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఈ సినిమా లో దక్కించుకోలేకపోయారు. డాన్స్ విషయం లో మాత్రం  ఎప్పటిలాగే ప్రేక్షకులను అలరించాడు . సెకండ్  హాఫ్  నుంచి  చాల  బాగుందని చెప్పవచ్చు.సినిమాలో DSP మ్యూజిక్  కానీ, యాక్షన్ కానీ ప్రేక్షకులను పూర్తిగా  ఊహించినంత మెప్పించలేదు.

చివరగా :

వినయ విద్యేయ రామ లో కుటుంబ బంధాలు, బాధాకరమైన కథానాయిక తో మరియు  యాక్షన్ ఎపిసోడ్ లతో  ముందుకు సాగిన ఈ సినిమా   పండుగ సీజన్లో, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని కొంత మొత్తానికి డబ్బు సంపాదించవచ్చు. మొత్తంమీద మీద చెప్పుకుంటే రంగస్థలము  సినిమా కథ  మెప్పించినంతగా ప్రేక్షకులకు  కొంతవరకు  నిరాశే మిగిలించిందని చెప్పవచ్చు.

Rating: 2/5