కే‌సి‌ఆర్ మీద రాములమ్మ నిజనిర్ధారణ..

0
113

టి‌ఆర్‌ఎస్ అధినేత.. తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ టార్గెట్ గా సోషల్ మీడియా లో విరుచుకుపడుతోంది కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్.. తెలంగాణ రాములమ్మ విజయశాంతి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రం లో చక్రం తిప్పాలనుకున్న కే‌సి‌ఆర్ ఆటలు ఇతర రాష్ట్ర పార్టీల అధినేతలు సాగనివ్వడం లేదంటూ ఎద్దేవా చేశారామె. ఇటీవల కే‌సి‌ఆర్ తమిళనాడు పర్యటన పై తన ట్విటర్ అక్కౌంట్ వేదికగా విజయశాంతి ఘాటు విమర్శలు గుప్పించారు. ఆమె ఇంకా ఏమంటున్నారో ఆమె మాటల్లోనే..

‘ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గత మూడు నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఆడిన డ్రామాకు తెరపడింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలికిన గులాబీ బాస్.. ఇప్పుడు దిక్కు తోచని స్ధితిలో ఉన్నట్లు టీఆరెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.’

‘డీఎంకే అధినేత స్టాలిన్ ఇచ్చిన షాక్ తో టీఆరెస్ అధినేతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్లుంది. మాయమాటలు చెప్పి, రాష్ట్ర విభజన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న విధంగానే, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకున్న కల్వకుంట్ల కుటుంబం కలలు కల్లలుగా మిగిలిపోయాయి.’