చంద్ర‌బాబును ఫెవికాల్ బాబా అంటూ విజ‌య‌సాయిరెడ్డి పంచ్‌..!

0
161

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత రాష్ట్రంలో గెలుపొందే అవ‌కాశం లేకపోవ‌డంతో ఢిల్లీ, లక్నోలో తిరుగుతున్నాడ‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి ఎద్దేవ చేశారు. ఎన్డీయేత‌ర పార్టీలు అస్తిత్వ స‌మ‌స్యను ఎదుర్కొంటుంటే చంద్ర‌బాబు మాత్రం ఐక్య‌త చర్చ‌లంటూ హ‌డావుడి చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో యూపీఏ, మాయావ‌తి, అఖిలేష్ ఫ్రంట్‌లు చ‌తికిల‌ప‌డ్డాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవ చేశారు. గ‌త ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు గ్రాఫ్ ఘోరంగా ప‌డిపోయింద‌న్న విష‌యం వారికి అర్ధమైంద‌ని, అందుకే వారు చంద్ర‌బాబుకు దూరంగా త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని సెటైర్ వేశారు.