సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌శాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

0
297

తెలంగాణ కాంగ్రెస్ మ‌హిళా నేత విజ‌య‌శాంతి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. కాగా, గ‌త మూడురోజుల క్రితం ఏపీ ప్ర‌భుత్వ కేబినేట్ ఏర్పాటైన సంగ‌తెలిసిందే. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎంపిక చేసిన ఈ కేబినేట్ కూర్పులో ఆ పార్టీకి చెందిన న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు.

సినీ రంగం నుంచి వ‌చ్చిన మ‌హిళా నేత‌ల‌ను కేవ‌లం పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమితం చేయ‌కుండా, వైసీపీలో స‌ముచిత స్థానం క‌ల్పించేలా సీఎం జ‌గ‌న్ రోజాకు మంత్రి ప‌ద‌వి కేటాయించి ఉంటే బాగుండేద‌ని విజ‌య‌శాంతి త‌న అభిప్రాయాన్ని తెలిపారు. సీఎం జ‌గ‌న్ చెప్పిన మాదిరి రెండున్న‌రేళ్ల త‌రువాత జ‌ర‌గ‌నున్న‌ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా రోజాకు అవ‌కాశం క‌ల్పించాలంటూ ఆమె సూచ‌న‌ప్రాయంగా తెలిపారు.