‘బ్రేకప్’ లో విజయ్ దేవరకొండ ..!

0
242
vijay devarkonda breakup

యూత్ క్రేజ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదివరకే భర త్ కమ్మదర్శకత్వంలో ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్దమవుతుంది. మరో వైపు క్రాంతి మాధవ్‌ డైరెక్షన్ లో ఒక రొమాంటిక్ ఎంటెర్టైన్మెంట్ చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు క్యూ లో ఉండగానే, మరో వైపు తమిళ డైరెక్టర్ ఆనంద్‌ అన్నామలై సినిమాకు సై అన్నాడు.

కాంత్రి మాధవ్‌ దర్శకత్వం లో రాబోతున్న సినిమాలో విజయ్‌ దేవరకొండ ఎన్నో సార్లు లవ్ ఫెయిల్యూర్ కాబడతాడట. ప్రేమ లో ఓడిపోయి బాధితుడిగా కనిపించే కథతో సాగే సినిమాకు ‘బ్రేకప్‌’ టైటిల్ ను పరిశీలిస్తున్నారట దర్శక నిర్మాతలు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కపోతున్న సినిమాలో న‌లుగురు హీరోయిన్స్ రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, కేథ‌రిన్ థ్రెస్సా, ఇస‌బెల్లా విజ‌య్ తో కలిసి న‌టిస్తున్నారు. ఇందులో విజ‌య్ ముగ్గురు అమ్మాయిల ప్రేమలో పడతాడట కానీ వారితో బ్రేక‌ప్ జరుగుతుంది. చివ‌ర‌కు ఒక్క అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతాడు. అతని జీవితంలో ఇన్ని బ్రేక‌ప్ ల కారణంగానే ఈ మూవీకి ‘బ్రేక‌ప్’ అయితే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం.

త‌మిళ డైరెక్టర్ ఆనంద్ అన్నమ‌లై స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న విజయ్ సినిమా ఈ మధ్యే మొదలైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న చిత్రంలో మ‌ల‌యాళ‌ న‌టి మాళ‌విక మోహ‌న‌న్ విజయ్ సరసన నటిస్తుంది.