విజయ్ దేవరకొండ రొమాన్స్ ఈ హీరోయిన్ తోనా..?

0
206
Vijay Devarkonda movie
Vijay Devarkonda romantic Movie

విజయ్ దేవరకొండ యూత్ లో ఒక క్రేజ్. తెలుగులోనే సినిమాలు నటించిన అన్ని బాషల అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇంతమంది అభిమానులను చోరకొనుటకు కారణమేంటని చూస్తే అతను ప్రతి సినిమాల్లోనూ వేరియేషన్స్ చూపించడమే. ఇలా నటిస్తున్న ప్రతి సినిమా సినిమాకి ఎంతో తేడాను చూపిస్తున్నాడు మన హీరో. రకరాల లుక్ లో కనిపిస్తూ అందరి మనసులను దోచేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంలో అమ్మాయి ప్రేమలో పడి, పిచ్చివాడిలా కనిపించాడు. గీతగోవిందంలో ఎంతో డీసెన్సీని పండించాడు. నోటా మూవీలో రాజకీయ నాయకుడిలా అదరగొట్టాడు విజయ్. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు.

క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో దేవరకొండ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సింగరేణి కార్మికుడిగా, సింగరేణి కార్మికుల నాయకుడిగా కనిపిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమాలో ఎనిమిదేళ్ల కుర్రాడికి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు యంగ్ హీరో. ఈ వేరియేషన్ ఎలా చూపిస్తాడని ఎంత ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రంలో రాశిఖన్నా, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్ లు నలుగురు కథానాయకులు నటిస్తున్నారు. కానీ ఈ నలుగురిలో ఎవరితో రొమాన్స్ చేయబోతున్నాడని మరో ప్రశ్న తలెత్తింది మం అభిమానులకు.